హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాగజ్ నగర్‌లో దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ జయంతి

ASF: కాగజ్ నగర్ పట్టణంలోని తన నివాసంలో ఎమ్మెల్యే హరీష్ బాబు ఆధ్వర్యంలో పండిట్ దీన్‌దయాల్‌ ఉపాధ్యాయ జయంతిని ఇవాళ నిర్వహించారు. దీన్‌దయాల్‌ చిత్రపటానికి పూలమాల వేసి MLA నివాళులర్పించారు. MLA మాట్లాడుతూ గ్రామం అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందుతుందని తెలిపిన వ్యక్తి దీన్‌దయాళ్‌ అని కొనియాడారు. ఆయన చరిత్రను ప్రతీ ఒక్కరు చదవాలన్నారు.