హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాష్ట్ర ఉత్తమ క్రీడాకారిణిగా మహాలక్ష్మి

WGL: నర్సంపేట పట్టణంలోని విజ్డమ్ హైస్కూల్ విద్యార్థిని దుర్గం మహాలక్ష్మి సాఫ్ట్ బాల్ క్రీడలో రాష్ట్ర స్థాయిలో ఉత్తమ క్రీడాకారిణిగా ఎంపికైంది. తెలంగాణ సాఫ్ట్ బాల్ అసోసియేషన్ నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచి ఈ అవార్డును సొంతం చేసుకుంది. ఈ సందర్భంగా పాఠశాల యాజమాన్యం, ఉపాధ్యాయులు మహాలక్ష్మిని శాలువాతో సన్మానించారు.