హైదరాబాద్: 28°C
తెలంగాణ

తాలిపేరు ప్రాజెక్టుకు భారీగా వరద గేట్లు ఎత్తివేత..!

BDK: చర్ల మండలం తాలిపేరు ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. శుక్రవారం ప్రాజెక్టు 15 గేట్లను ఎత్తి 64,587 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇందులో 8 గేట్లు ఫ్రీ ఫ్లో, 7 గేట్లు 2 అడుగుల మేర ఎత్తి ఉంచారు. ప్రాజెక్టుకు ప్రస్తుత ఇన్ ఫ్లో 62,680 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుత నీటిమట్టం 73.00 అడుగులకు చేరింది అని అధికారులు తెలిపారు.