BDK: కొత్తగూడెం పట్టణంలోని 3 టౌన్ పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం ఉద్రిక్తత నెలకొంది. కుటుంబ తగాదాపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన కుటుంబ సభ్యులు స్టేషన్ ప్రాంగణంలోనే 2 వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసు సిబ్బంది ఇరువర్గాలను చెదరగొట్టారు. ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ
పోలీస్ స్టేషన్‌లో ఇరువర్గాల ఘర్షణ


