హైదరాబాద్: 28°C
తెలంగాణ

మృతురాలికి నివాళి అర్పించిన మున్సిపల్ చైర్మన్

JN: స్టేషన్ ఘన్పూర్ మండలం తాటికొండ గ్రామానికి చెందిన చాడ రాజమ్మ అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్ శుక్రవారం ఉదయం వారి నివాసానికి వెళ్లి రాజమ్మ పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమను ప్రగాఢ సానుభూతి తెలిపారు.