హైదరాబాద్: 28°C
తెలంగాణ

గ్రామంలో పర్యటించిన జిల్లా వ్యవసాయ అధికారి

NRML: నిర్మల్ మండలం కౌట్ల కె గ్రామంలో ఇవాళ జిల్లా వ్యవసాయ అధికారి సుజాత పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీలో సర్పంచ్ రాజు శాలువాతో ఘనంగా సన్మానించారు. డిఏవో మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్ట్రేషన్, యూరియా బుకింగ్ పై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ రఘు, మండల వ్యవసాయ అధికారి అంబాజీ, కార్యదర్శి లక్ష్మణ్, రైతులు పాల్గొన్నారు.