హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెన్షన్ దరఖాస్తుల వెరిఫికేషన్

WNP: పాన్‌గల్ మండలంలోని శాఖాపూర్ తాండలో సర్పంచ్ నేనావత్ నాగేష్ ఆధ్వర్యంలో అర్హులైన పెన్షన్ దరఖాస్తుదారుల వెరిఫికేషన్ నిర్వహించారు. MEO ఆనంద్ లబ్ధిదారుల వివరాలను పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాల ప్రయోజనాలు అందేలా చర్యలు తీసుకుంటామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి రత్నమాల, దరఖాస్తుదారులు పాల్గొన్నారు.