హైదరాబాద్: 28°C
తెలంగాణ

భారీ వర్షాలతో రిజర్వాయర్లకు జలకళ..!

ఖమ్మం జిల్లాలోని భారీ వర్షాలకు సాగునీటి ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. పాలేరు రిజర్వాయర్‌ 22, వైరా 19.5 అడుగులకు చేరాయి. దీంతో 5,09,978 ఎకరాల్లో వరి, పత్తి సాగు చేస్తున్న రైతుల్లో ఆనందం నెలకొంది. ఆయకట్టు పరిధిలోని 50 వేల ఎకరాలకు సాగునీటి కష్టాలు తీరడంతోపాటు ఖమ్మం నగర తాగునీటి అవసరాలు కూడా తీరనున్నాయని అధికారులు తెలిపారు.