హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రధాన రహదారిపై పొంచి ఉన్న ప్రమాదం

BHPL: చిట్యాల మండల కేంద్రంలోని ప్రధాన రహదారి వెంట భారీ చెట్టు రహదారిపైకి వాలిపోవడంతో వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రమాదకరంగా ఉన్న చెట్టును తొలగించి ప్రమాదాన్ని నివారించాలని స్థానికులు కోరుతున్నారు.