హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అకాల వర్షాలతో భారీ పంట నష్టం

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కోటికలపూడిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న అకాల వర్షాలతో టమాట, మిర్చి, వరి, మినుము పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చేతికొచ్చే దశలో పంటలు నీటమునిగి కుళ్లిపోతుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి, తక్షణమే నష్టపరిహారం అందించాలని రైతులు కోరుతున్నారు.