PPM: తుఫాన్ ప్రభావంతో బలిజిపేట మండలంలోని పెదపెంకి గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామం లోపల, బయట భారీగా వరదనీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సీ కాలనీ, రెల్లివీధుల్లోని ఇళ్లలోకి నీరు చేరగా, కాపువీధి, నాయుడువీధిలో పలు కుటుంబాలు ఇళ్లను ఖాళీ చేశాయి. పంట పొలాలు నీటమునగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
పెదపెంకి జలదిగ్బంధం..


