హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

తెనాలి డివిజన్‌లో భారీ వర్షపాతం

GNTR: తెనాలి డివిజన్‌లో భారీ వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఉదయం వరకు డివిజన్ వ్యాప్తంగా మొత్తం 556 మి.మీ వర్షం కురవగా, సగటు 69.5 మి.మీగా నమోదైంది. అత్యధికంగా దుగ్గిరాలలో 105.2 మి.మీ, మంగళగిరిలో 98.2, తాడేపల్లిలో 94.6, కొల్లిపరలో 87.6, తెనాలిలో 73.2 మి.మీ వర్షపాతం నమోదైంది. పొన్నూరులో 34.2, చేబ్రోలులో 53.8, కాకుమానులో 9.2 మి.మీ వర్షం కురిసింది.