HYD: బడా గణేశుడి శోభాయాత్ర ప్రారంభమైంది. ఖైరతాబాద్ లైబ్రరీ చౌరస్తా నుంచి రాజ్ దూత్ చౌరస్తా, టెలిఫోన్ భవన్, తెలంగాణ తల్లి చౌరస్తా, సచివాలయం ముందు నుంచి NTR మార్గ్ క్రేన్ నెం.4 వద్దకు చేరుకుంటుంది. భక్తులు అధిక సంఖ్యలో బడా గణేశుడి నిమజ్జనం చూడడానికి తరలివచ్చారు. నిమజ్జనంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
తెలంగాణ
ప్రారంభమైన బడా గణేశుడి శోభాయాత్ర


