హైదరాబాద్: 28°C
తెలంగాణ

మరికాసేపట్లో ప్రారంభం కానున్న శోభాయాత్ర

HYD: ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర మరికాసేపట్లో ప్రారంభం కానుంది. హైడ్రాలిక్ ఫెయిల్ కావడంతో శోభాయాత్రకు కాస్త ఆలస్యమైంది. నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీపీ సజ్జనార్ వెల్లడించారు. మధ్యాహ్నం 2 గంటల్లోపు నిమజ్జనం పూర్తవుతుందని, శోభాయాత్ర రూట్‌లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని ఆయన తెలిపారు. భక్తులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.