హైదరాబాద్: 28°C
తెలంగాణ

గణేష్ నిమజ్జనం.. మద్యం విక్రయాలు బంద్

KNR: గణేష్ నిమజ్జన శోభాయాత్ర శాంతియుతంగా జరిగేందుకు తెలంగాణలోని కరీంనగర్ జిల్లాల్లో పోలీసులు మద్యం విక్రయాలపై కఠిన ఆంక్షలు విధించారు. ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు వైన్ షాపులు, కల్లు కాంపౌండ్లు, బార్లు మూసివేయాలని ఆదేశించారు. అయితే, స్టార్ హోటళ్లు, రిజిస్టర్డ్ క్లబ్బులకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చారు.