హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావొద్దు'

కృష్ణా: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో కోడూరు మండలంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రజలను అప్రమత్తం చేసేందుకు MRO కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు తహసీల్దార్ పూర్ణచంద్రరావు తెలిపారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, సహాయం కోసం 9603578190, 9959921804 నంబర్లను సంప్రదించాలని కోరారు.