హైదరాబాద్: 28°C
తెలంగాణ

మద్యం, డీజేలకు దూరంగా ఉండాలి:ఎస్పీ

SRD: వినాయక శోభాయాత్రలో మద్యం, డీజేలకు దూరంగా ఉండాలని ఎస్పీ పారితోష్ పంకజ్ సూచించారు. డీజేల వల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందని చెప్పారు. వినాయక శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని పేర్కొన్నారు. పోలీసులు సూచించిన మార్గంలోని శోభాయాత్రలు నిర్వహించుకోవాలన్నారు. నిమజ్జనాలు ప్రశాంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ తెలిపారు.