ASR: డుంబ్రిగూడ మండలం అరమ పంచాయతీ పరిడి గ్రామ హౌసింగ్ కాలనీలో వీధిలైట్లు లేక స్థానికులు రాత్రివేళ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీ అంతా చీకటిగా ఉండటంతో రాకపోకలకు అవస్థలు పడుతున్నామని తెలిపారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండటంతో చీకట్లో వెళ్లాలంటే మరింత ప్రమాదకరంగా మారిందని వాపోయారు. అధికారులు ఈ సమస్యను పరిష్కరించాలంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పరిడి హౌసింగ్ కాలనీలో వీధిలైట్లు కరువు


