ELR: కొయ్యలగూడెం మండలం కన్నాపురం తూర్పు కాలువ దాటుతూ గురువారం సాయంత్రం ప్రమాదవశాత్తు గల్లంతైన పూనెం భాస్కరరావు (60) శుక్రవారం శవమై తేలారు. కన్నాపురం నుంచి కోట రామచంద్రపురం వెళ్లే క్రమంలో ఆయన వాగు దాటుతూ ప్రవాహంలో కొట్టుకుపోయారు. గాలింపు చర్యల అనంతరం ఆయన మృతదేహం లభ్యమైంది. ఈ ఘటనతో ఆయన కుటుంబంలో విషాదఛాయలు అలముకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
కాలువలో కొట్టుకుపోయిన వ్యక్తి మృతి


