హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెట్రోల్ పంప్ ఏర్పాటు చేయాలని వినతి

JGL: జగిత్యాల ఓల్డ్ బస్‌స్టేషన్ సమీపంలో పెట్రోల్, డీజిల్ పంప్ ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి ఐజీ భూపాల్‌కు వినతిపత్రం అందజేశారు. పట్టణంలోని ఈ ప్రాంతంలో ఇంధన సౌకర్యం లేక వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గతంలో చేసిన విజ్ఞప్తులను పరిశీలించి, పెట్రోల్ పంప్ ఏర్పాటుకు చర్యలు తీసుకుని 2026లో ప్రారంభించాలని కోరారు.