BDK: భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి క్రమంగా పెరుగుతోంది. నిన్న ఉదయం 16.7 అడుగులుగా ఉన్న నీటిమట్టం శుక్రవారం ఉదయం 6 గంటలకు 17.80 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటి విడుదల 1,39,136 క్యూసెక్కులుగా ఉంది. రానున్న 24 గంటల్లో వరద మరింత పెరిగే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.
తెలంగాణ
భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి


