HNK: ఐనవోలు మండలం పంతిని గ్రామంలో భారీ వర్షాలకు ఇల్లు కూలిపోయింది. గ్రామానికి చెందిన నస్కురి రాజేందర్ ఇంటి మట్టి గోడలు వర్షాలకు నాని బలహీనపడి అర్ధరాత్రి పూర్తిగా కూలిపోయాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణాపాయం తప్పింది. అయితే ఇంట్లోని నిత్యావసర సరకులు, వంట సామగ్రి, బట్టలు బురదలో కూరుకుపోవడంతో కుటుంబానికి తీవ్ర నష్టం వాటిల్లింది.
తెలంగాణ
అర్ధరాత్రి కూలిన ఇల్లు.. తప్పిన ప్రాణాపాయం


