హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఫుట్‌పాత్‌పై దుకాణాలు.. ప్రమాద ముప్పు

KDP: సిద్ధవటం (M) మాధవరం-1 వద్ద కడప–చెన్నై జాతీయ రహదారి ఫుట్‌పాత్‌ను ఆక్రమించి కొందరు దుకాణాలు నిర్వహిస్తున్నారు. దీంతో వాహనదారులకు ఇబ్బందులు, ప్రమాదాల ముప్పు పొంచి ఉందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుకాణాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు. ఫుట్‌పాత్‌పై దుకాణాలు తొలగించాలని యజమానులను ఆదేశిస్తామని ఇన్‌‌ఛార్జి పంచాయతీ కార్యదర్శి నాన్సీ తెలిపారు.