GNTR: GMC ఎన్నికల పోలింగ్ కేంద్రాల ప్రాథమిక జాబితాను నేడు ప్రకటించనున్నట్లు కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ఈ జాబితా అందుబాటులో ఉంటుందన్నారు. దీనిపై అభ్యంతరాలు రేపు రిటర్నింగ్ అధికారులు స్వీకరించనున్నట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల సవరణలు, మార్పులపై గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులు, అధికారులు సమావేశం నిర్వహించి సలహాలను స్వీకరిస్తారన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలింగ్ కేంద్రాల ప్రాథమిక జాబితా నేడు విడుదల


