NLR: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు గాను అనంతసాగరం మండలంలోని సోమశిల జలాశయానికి వరద నీరు వచ్చి చేరుతోంది. శుక్రవారం ఉదయం 6 గంటల నాటికి జలాశయంలో 17.396 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అధికారులు తాజాగా ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. జలాశయంలో 61 క్యూసెక్కుల నీరు ఆవిరి అవుతుంది. సోమశిల జలాశయానికి 10504 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్
VIDEO: 17 టీఎంసీలకు సోమశిల జలాశయ నీటిమట్టం


