హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: మహా గణపతి శోభాయాత్రలో 25 షీ టీమ్స్ ఏర్పాటు: సీపీ

HYD: ఖైరతాబాద్ మహా గణపతి శోభాయాత్ర, నిమజ్జనం కోసం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. మహిళల రక్షణ, దొంగతనాల నివారణకు 25 షీ టీమ్స్, 15 సీసీఎస్ క్రైమ్ టీమ్స్‌ను రంగంలోకి దించామన్నారు. మధ్యాహ్నం 2 గంటల లోపే నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయనున్నట్లు సీపీ వెల్లడించారు.