MDK: జిల్లాలో ఇవాళ ఉదయం 10.30 గంటలకు సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో దిశా కమిటీ సమావేశం నిర్వహించనున్నట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. ఎంపీ రఘునందన్ రావు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరుకావాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై సమావేశంలో సమీక్ష నిర్వహించనున్నట్లు ఆమె పేర్కొన్నారు.
తెలంగాణ
నేడు దిశా కమిటీ సమావేశం: కలెక్టర్


