NTR: విజయవాడ రాజీవ్‌నగర్‌లోని వడ్డెర కాలనీలో ఓ ఇంట్లో పేకాట ఆడుతూ మద్యం తాగుతున్న ఆరుగురిని పక్కా సమాచారంతో నిన్న రాత్రి నున్న పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 58,600 నగదు, 3 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని సీఐ అహ్మద్ తెలిపారు. నిందితులంతా రాజీవ్ నగర్, పాయకాపురం ప్రాంతానికి చెందిన వారని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్
పేకాట స్థావరంపై పోలీసుల దాడి


