హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారిపై చెట్లు.. పోలీసుల చొరవతో తొలగింపు

SDPT: కోహెడ–కరీంనగర్ రహదారిపై గొట్లమిట్ట శివారులో చెట్లు విరిగిపడి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎస్‌ఐ పుల్లా అభిలాష్ సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు. గ్రామస్థులు, జేసీబీ సహాయంతో చెట్లను తొలగించి వాహనాల రాకపోకలను పునరుద్ధరించారు. పోలీసుల సత్వర స్పందనతో ప్రయాణికులకు ఇబ్బందులు తప్పాయి.