హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రేపు వింజమూరులో జాబ్ మేళా

NLR: వింజమూరు పట్టణంలోని నేతాజీ డిగ్రీ కళాశాలలో ఈనెల 26వ తేదీన జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు కళాశాల కరస్పాండెంట్ గోపి తెలియజేశారు. ఈ జాబ్ మేళా కార్యక్రమంలో సుమారుగా 20 కంపెనీలు పాల్గొంటాయన్నారు. పది, ఇంటర్, బీటెక్, డిగ్రీ చదివిన వారు అర్హులని తెలియజేశారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.