ELR: భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీలుగుమిల్లీ ఎస్సై వి. క్రాంతికుమార్ సూచించారు. వాగులు, కల్వర్టులు పొంగిపొర్లుతున్నందున వాటిని దాటే ప్రయత్నం చేయవద్దని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని, వర్షాలు తగ్గే వరకు ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని కోరారు. అధికారిక సూచనలు పాటించాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై


