ASR: గిరిజన మత్స్యకారులకు ప్రభుత్వం నుంచి సబ్సిడీపై పడవలు, వలలు అందనున్నాయి. ప్రధాన మంత్రి మత్స్యసంపద యోజనలో భాగంగా 2026-27 సంవత్సరానికి 60 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు మత్స్య శాఖ ఏడీ శ్రీనివాస్ తెలిపారు. అర్హులైన వారు ఈ నెల 30లోగా గ్రామ మత్స్య సహాయకుల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు 90140 00966 నంబర్‌లో సంప్రదించవచ్చు.
ఆంధ్రప్రదేశ్
పడవలు, వలలకు సబ్సిడీ


