హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనపై జరిమానా

KMM: ఆహార భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించిన 11 కేసులను గురువారం అదనపు కలెక్టర్ సమక్షంలో ఫుడ్ సేఫ్టీ అధికారి లోకేష్ పరిష్కరించారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు మొత్తం రూ.2.90 లక్షల జరిమానా విధించారు. రమేష్ ధాబాకు రూ.లక్ష, హవేలీకి రూ.75 వేలు, రిలయన్స్‌కు రూ.50 వేల ఫైన్ వేశారు. నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.