హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఈ నెల 27న జిల్లా స్థాయి కబడ్డీ జట్టు ఎంపిక

BPT: 52వ జూనియర్ బాలికల జిల్లా స్థాయి కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు ఈ నెల 27న జరగనున్నాయి. బాపట్ల స్థానిక మున్సిపల్ ఉన్నత పాఠశాల క్రీడా ప్రాంగణంలో మధ్యాహ్నం 2 గంటల నుంచి ఈ ఎంపిక ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఈ ఎంపికల్లో పాల్గొనే బాలికలు 29-11-2006 తర్వాత జన్మించి ఉండాలని, బరువు 65 కిలోలలోపు ఉండాలని స్పష్టం చేశారు. ఆసక్తి కలిగిన క్రీడాకారిణులు వేదిక వద్దకు చేరుకోవాలని కోరారు.