హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఈ నెల 26న జిల్లా కోర్ట్ ల్లో ప్రత్యేక లోక్ అదాలత్

ASF: ఆసిఫాబాద్ జిల్లాలోని కోర్టుల్లో ఈ నెల 26న ఉదయం ప్రత్యేక లోక్ అదాలత్ ఉంటుందని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి జి. అనూష ప్రకటనలో తెలిపారు. బ్యాంకు రికవరీలు, చెక్ బౌన్స్, రుణ సంబంధిత పీఎల్సీ పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కారం కోసం ప్రత్యేక లోక్ అదాలత్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.