హైదరాబాద్: 28°C
తెలంగాణ

వర్షాలపై కలెక్టర్లతో మంత్రి పొంగులేటి సమీక్ష

KMM: అల్పపీడన ప్రభావంతో ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి సమీక్షించారు. గురువారం ఉమ్మడి జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి, లోతట్టు ప్రాంతాలపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలని ఆదేశించారు. 24 గంటల కంట్రోల్ రూమ్‌ ద్వారా సహాయం అందించాలన్నారు. అవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని మంత్రి సూచించారు.