హైదరాబాద్: 28°C
తెలంగాణ

122 లీటర్ల అక్రమ మద్యం పట్టివేత

NRPT: నారాయణపేట పట్టణంలోని సుభాష్ రోడ్డులోనీ ఓ ఇంట్లో టాస్క్ ఫోర్స్, నారాయణపేట టౌన్ పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ చేసిన 122 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ సుమారు రూ.69,500 వుంటుందని ఎస్సై వెంకటేశ్వర్లు తెలిపారు. బండి అఖిల్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.