హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పారిశుద్ధ్య నిర్వహణ తనిఖీ చేసిన కమిషనర్

GNTR: తెనాలి పట్టణంలోని పలు ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ జే. రామ అప్పలనాయుడు శుక్రవారం ఉదయం పర్యటించారు. డ్రైనేజీ ఔట్‌ఫాల్‌ పాయింట్లను తనిఖీ చేసి, కాలువల్లో పేరుకుపోయిన చెత్తను పరిశీలించారు. చెత్తను వెంటనే తొలగించి, పరిసరాల్లో పారిశుధ్యం మెరుగుపరిచేలా చర్యలు చేపట్టాలని సంబంధిత సిబ్బందికి కమిషనర్‌ ఆదేశాలు జారీ చేశారు.