హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కారులో చెలరేగిన మంటలు..!

MDCL: ఘట్‌కేసర్ నుంచి ఉప్పల్ వెళ్లే మార్గంలో మేడిపల్లి సమీపంలో కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురై వెంటనే కారు నుంచి దిగారు. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని చర్యలు చేపట్టారు. బ్యాటరీ వేడెక్కడం వల్లే మంటలు చెలరేగి ఉండొచ్చని డ్రైవర్ అనుమానం వ్యక్తం చేశాడు.