PPM: తోటపల్లి జలాశయానికి వరద నీరు పోటెత్తింది. శుక్రవారం ఉదయం 5 గంటలకు 38,716 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో రావడంతో అధికారులు నాగావళి నదిలోకి 45,661 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. జలాశయ నీటిమట్టం 105 మీటర్లకు గాను ప్రస్తుతం 104.04 మీటర్లుగా ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 2.534 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 1.925 టీఎంసీల నీరు ఉన్నట్లు అధికారి కిశోర్ కుమార్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
తోటపల్లి జలాశయానికి భారీగా వరద నీరు


