హైదరాబాద్: 28°C
తెలంగాణ

జేసీబీతో చెట్టు తొలగింపు

PDPL: పెద్దపల్లి-మంథని ప్రధాన రహదారిపై రామగిరి మండలం నాగేపల్లి బస్టాండ్ సమీపంలో భారీ వర్షానికి చెట్టు కూలి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న మంథని సీఐ బుద్ధె స్వామి వెంటనే అక్కడికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. అనంతరం జేసీబీని తెప్పించి చెట్టును తొలగించేలా చర్యలు చేపట్టడంతో వాహనాల రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి.