హైదరాబాద్: 28°C
తెలంగాణ

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

BHPL: గణపురం మండలంలోని గొల్లపల్లిలో గురువారం విద్యుదాఘాతంతో దాసరి రాజు (39) మృతి చెందాడు. ఇంటిపై పడుతున్న వేపకొమ్మలను తొలగించేందుకు చెట్టు ఎక్కిన రాజు.. కొమ్మలు సమీపంలోని 11 కేవీ విద్యుత్ వైర్లకు తగలడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు.