హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ టెండర్‌కు భారీ స్పందన

JGL: మెట్పల్లి మండలం బండలింగాపూర్ ఆలయంలో కొబ్బరికాయలు, పూజా సామగ్రి, లడ్డూ, పులిహోర విక్రయ హక్కుల కోసం నిర్వహించిన టెండర్ ద్వారా రూ. 2.48 లక్షల ఆదాయం సమకూరిందని ఈవో విక్రమ్ తెలిపారు. బండలింగాపూర్‌కు చెందిన చెన్నూరి నిర్మల టెండర్‌ను దక్కించుకున్నట్లు పేర్కొన్నారు. గతేడాది వచ్చిన ఆదాయం కంటే ఈసారి రూ.1.06 లక్షలు అదనంగా సమకూరినట్లు తెలిపారు.