ELR: ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో అభివృద్ధి పనులపై ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. అధ్యక్షుడు ఎస్వీ సుధాకరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మినీ కల్యాణ మండపం నిర్మాణానికి ఆమోదం తెలిపారు. స్వామివారి నిత్య కైంకర్యాల కోసం దేవుడి తోటలో తులసి వనం పెంచాలన్నారు. వినాయకుడి ఆలయం, ప్రసాదాల కౌంటర్‌లను అనువైన ప్రాంతాలకు మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
శ్రీవారి క్షేత్రంలో అభివృద్ధి పనులకు ఆమోదం


