హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిలిచిపోయిన మహిళా శక్తి భవన నిర్మాణాలు

JN: చిల్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో రూ.10 లక్షలతో చేపట్టిన మహిళా శక్తి భవనాల నిర్మాణ పనులు నిలిచిపోయాయి. దేశాయితండాలో ఏడు నెలల క్రితం ప్రారంభమైన పనులు స్లాబ్ లెవల్ వరకు వచ్చి ఆగిపోయాయి. ఇతర గ్రామాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అధికారులు స్పందించి పనులు వేగవంతం చేయాలని గురువారం స్థానికులు కోరుతున్నారు.