హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భారీ వర్షాలు.. కోరింగ అభయారణ్య సందర్శన నిలిపివేత

KKD: తాళ్లరేవు మండలంలోని కోరింగ అభయారణ్య సందర్శనను రెండు రోజులుగా నిలిపివేసినట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వరప్రసాద్ తెలిపారు. వర్షాలు పూర్తిస్థాయిలో తగ్గే వరకు సందర్శకులను అనుమతించబోమన్నారు. బోటు షికారును కూడా నిలిపివేసినట్లు చెప్పారు. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. తిరిగి సందర్శనకు అనుమతించే వరకు ఎవరూ రావద్దన్నారు.