ADB: జిల్లాలో పోక్సో కేసు నిందితుడు కోర్టుకు హాజరుకాకపోవడంతో, అతనికి షూరిటీగా నిలిచిన పర్చాకి జ్యోతిరామ్, గేడం నగేష్‌కు 3 నెలల జైలు శిక్ష విధించినట్లు టూ టౌన్ సీఐ నాగరాజు గురువారం తెలిపారు. జైలు నుంచి విడుదలైన నిందితులు న్యాయస్థానం ఎదుట హాజరు పరిచే బాధ్యత షూరిటీ వ్యక్తులపై ఉంటుందన్నారు. లేనిపక్షంలో షూరిటీ వ్యక్తులపై చర్యలు తప్పవని సీఐ హెచ్చరించారు.
తెలంగాణ
నిందితుడికి షూరిటీ ఇచ్చిన ఇద్దరికి జైలు శిక్ష


