PPM: భారీ వర్షాల నేపథ్యంలో సహాయక చర్యలకు గురువారం సీతంపేటకు చేరుకున్న NDRF బృందాలకు జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి కీలక సూచనలు చేశారు. వాగులు,వంకలు, కాజ్‌వేల వద్ద నిఘా ఏర్పాటు చేసి ప్రజలు ప్రమాదకరంగా దాటకుండా చూడాలని ఆదేశించారు. కొండచరియలు, ముంపు ముప్పు ఉన్న గ్రామాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
NDRF బృందాలకు కలెక్టర్ కీలక సూచనలు


