E.G: జిల్లా బాలల పరిరక్షణ విభాగం ఆధ్వర్యంలో స్పాన్సర్షిప్, పీఎం కేర్స్ పథకాల లబ్ధిదారులైన పిల్లలు, సంరక్షకులతో గురువారం కలెక్టరేట్లో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. కలెక్టర్ కీర్తి చేకూరి పాల్గొని పిల్లలతో నేరుగా మాట్లాడి వారి చదువు, భవిష్యత్ లక్ష్యాలు, సమస్యలను తెలుసుకున్నారు. కష్టాలను అధిగమించి లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పిల్లలు లక్ష్యసాధన దిశగా ముందుకు సాగాలి: కలెక్టర్


