కోనసీమ: రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ గురువారం తూర్పుపాలెంలో విలేజ్ హెల్త్ సెంటర్ శంకుస్థాపన కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయన భద్రత కోసం వచ్చిన పోలీసుల వాహనం కేసనపల్లి వద్ద అకస్మాత్తుగా మొరాయించింది. ఎంత ప్రయత్నించినా స్టార్ట్ కాకపోవడంతో పాటు భారీ వర్షం కురవడంతో పోలీసులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరకు వాహనాన్ని అక్కడే వదిలి వెళ్లాల్సి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్
ఎమ్మెల్యే పర్యటనలో మొరాయించిన పోలీసుల వాహనం


